Hm9న్యూస్ వరంగల్ జిల్లా: సంగెం మండలం మొండ్రాయి గ్రామంలోని భారతీయ పురుషుల పొదుపు సంఘం సభ్యులు గూడ రమణ,పెండ్లి సంపత్ ఇటీవల మృతి చెందారు.వారికి ఇవ్వవలసిన అభయ నిధి విపత్సహాయం,ఇన్సూరెన్స్, బోనస్,పొదుపు కలిపి గూడ రమణ భార్య స్రవంతికి 79,401రూపాయలను,పెండ్లి సంపత్ భార్య పద్మకు 1,03,324/- రూపాయలను సంఘ అధ్యక్షుడు దేవులపల్లి రాజు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యార సూరయ్య,పాలకవర్గ సభ్యులు.రాములు,మురళి,చిరంజీవి,రాజయ్య,కొమురయ్య,యాకయ్య, గణకుడు పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.