Search
Close this search box.

నేరం చేస్తే శిక్ష తప్పదు జిల్లా SP

Date:14-08-2024

రాజన్న సిరిసిల్ల జిల్లా.

 

*హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు,5000/- జరిమానా,, ఒకరికి 07 సంవత్సరాల జైలు శిక్ష,3000/- జరిమానా.*

 

*నేరం చేస్తే శిక్ష తప్పదు,శిక్షలతోనే సమాజంలో మార్పు.*

 

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు.*

 

*హత్య కేసులో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల గ్రామానికి చెందిన బారాజు మల్లారెడ్డి కి జీవిత ఖైదు , 5000/- రూపాయల జరిమాన,బారాజు నరసింహారెడ్డి కి 07 సంవత్సరాల జైలు శిక్ష,3000/- రూపాయల జరిమాన విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత గారు బుధవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.*

 

వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బారాజు మల్లారెడ్డి , నరసింహా రెడ్డి మరియు ఎమిరెడ్డి రాంరెడ్డి , కనక రెడ్డి ,లచ్చి రెడ్డి అను వారికి చాలా కాలం గా భూమి తగాదాలు ఉన్నందున ఈ క్రమంలో 2015-05-25 తేదీన సాయంత్రం ఏమిరెడ్డి రాంరెడ్డి మరియు అతని కుమారులు అయిన కనక రెడ్డీ , లచ్చిరెడ్డి లు వారి పొలం లో పనులు చేసుకొనుచుండ గా వారి పక్క పొలం వారు అయిన భారాజు మల్లారెడ్డి,తండ్రి నరసింహారెడ్డి ఇద్దరు అక్కడికి వచ్చి వారిని చంపాలనే ఉద్యేషంతో వారి పై ఎడ్ల కచరం కొయ్యాలతో ఎమిరెడ్డి రాంరెడ్డి , కనకారెడ్డి , లచ్చిరెడ్డీ లపై దాడి చేయగా రాంరెడ్డి స్పృహ కోల్పోగా, కనకారెడ్డి , లచ్చిరెడ్డీ లకు గాయాలు కాగా వారిని అక్కడ ఉన్నవారు వెంటనే వారిని కరీంనగర్ అపోలో రిచ్ హాస్పిటల్ నందు చికిత్స చేయించారు.రాంరెడ్డి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలి అని సూచించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్య లో రాంరెడ్డి చనిపోయాడు.ఈ ఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి బారాజు మల్లారెడ్డి, మరియు నరసింహా రెడ్డి ని రిమాండ్ కు తరలించారు.అప్పటి సీ.ఐ శ్రీనివాస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

 

ఈకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించాగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్లు నరేందర్, రమేష్ లు కోర్టులో 17 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులకి బారాజు మల్లారెడ్డి కి జీవిత ఖైదు,5000 రూపాయల జరిమానా,బారాజు నరసింహ రెడ్డికి 07 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.

 

*ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…*

 

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పై కేసులో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ నర్సింగరావు గారు, CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ రమేష్ CMS కానిస్టేబుల్స్ నరేందర్,లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి