హన్మకొండ జిల్లా పరకాల డిపో నుండి కాలేశ్వరం నుండి గుంటూరు వరకు వయా పరకాల మీదుగా కొత్త ఆర్టీసీ డీలక్స్ బస్సులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా ఎమ్మెల్యే పరకాల బస్టాండ్ నుండి వ్యవసాయ మార్కెట్ వరకు బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం అని అన్నారు.
కార్మికుల సంక్షేమం,ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ కార్మికులపై ఉందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బస్ సర్వీస్ ప్రారంభించేందుకు కృషి చేస్తానని అన్నారు.