HM9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: బుధవారం గ్రేటర్ వరంగల్ 17 వ డివిజన్ బొల్లికుంటలోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాల నందు అదనపు గదులను వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య , పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి లు కలిసి ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారని, దానికి తోడు రుచికరమైన మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఉచితదుస్తులు, పుస్తకాలు, తదితర వసతులు కల్పిస్తున్నామన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న సద్గురు సేవ సంస్థ సభ్యులని ఎమ్మెల్యే అభినందించారు.అన్ని కులాల పేద విద్యార్థులకు మెరుగైన వైద్య కల్పనే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కలిగిస్తుందన్నారు.పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలాల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గ ప్రత్యేక దృష్టి పెట్టారని,పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని,బిఆర్ఎస్ నాయకులు కావాలనే గురుకుల పాఠశాలపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.