తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. రెండు రోజుల కిందట రామ్మోహన్ గారి మాతృమూర్తి కమలమ్మ గారు మరణించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి నగరంలోని చర్లపల్లిలో రామ్మోహన్ నివాసానికి వెళ్లి వారి తల్లి కమలమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.