AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న CM చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్లపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే APకి కాస్త భారం తగ్గుతుంది.