పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలను గుర్తించి దసరా లోపు కేటాయించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ ఆర్డీవో దశరథ్ నాయక్ ను కలిసిన ఆయన అర్హులైన లబ్దిదారులకు వాటిని కేటాయించాలని సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మాడ్పోర్టు, మారెడుపల్లి, సిల్వర్ కంపౌండ్లో ఉన్న ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని సంబంధిత అధికారులకు సీఎం చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.