తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (TGCAB) పాలకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి టీజీకాబ్ పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. TGCAB చైర్మన్ ఎం.రవీందర్ రావు గారు, వైస్ చైర్మన్ కె.సత్తయ్య గారు, పలువురు డైరెక్టర్లు ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.