Hm9newsప్రతినిథి హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని ములుగు లో భూకంపం సంభవిం చింది. అంతేకాదు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడం తో ప్రజలు భయభ్రాంతు లకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.