హైదరాబాద్:
ఇంటికే ఆర్టీసి పార్శిళ్లు పార్శిళ్ల డెలివరీని మెరుగుపరిచేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముందుగా హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెలివరీ ఛార్జీలను వెల్లడించారు..