టీటీడీ చైర్మన్‌గా చాగంటి..?
టీటీడీ చైర్మన్‌గా పలువురి పేర్లు తెరమీదకి వస్తున్నాయి. తాజాగా చాగంటి కోటేశ్వరరావును టీటీడీ చైర్మన్‌గా నియమిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. కాకినాడకు చెందిన చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తూనే.. ప్రవచనాలు చెబుతూ అధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందారు. ఆయన పేరు టీటీడీ చైర్మన్ రేసులో ఎక్కువగా వినిపిస్తోంది.