డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో సంజీవ్ అహుజా గారు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఈవీ, సెమీకండక్టర్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై ఈ భేటీలో చర్చ జరిగింది. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు కూడా పాల్గొన్నారు.