వరద బాధితుల సహాయార్థం జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. జీఆర్టీ జ్యువెలర్స్ అధినేత జితేందర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికిఅండగా నిలుస్తూ విరాళం అందించినందుకు ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.