Hm9న్యూస్ ప్రతినిథి హన్మకొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో హనుమకొండ జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడా పోటీలను వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మరియు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కలిసి ప్రారంబించారు దాదాపుగా 300 మంది విధ్యార్టులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించటానికి రాష్ట్ర ప్రభుత్వం సిఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని, పోటీల్లో విధ్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సిఎం కప్ పోటీల్లో ప్రతిభ చాటి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హనుమకొండ డిఎస్వో అశోక్, సిపి అంబర్ కిశోర్ జా, కలెక్టర్ సత్య శారదా దేవి, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, గ్రంధాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు వరద రాజేశ్వర్ రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.