అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల నేపథ్యంలో పోక్సో కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తాను అవార్డు అందుకోవాలని, తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
‘నాకు ఇటీవల ఉత్తమ నృత్యదర్శకుడిగా అవార్డు వచ్చింది. దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది. అందుకుగాను ఐదు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని జానీ కోర్టును కోరాడు. కాగా, ఈ పిటిషన్‌పై ఈ నెల 7న విచారణ చేపడతామని రంగారెడ్డి ఫోక్సో కోర్టు పేర్కొంది.
మరోవైపు కొరియోగ్రాఫర్ బెయిల్ పిటిషన్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. నిందితుడిని బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని తమ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.