జతీయ యువజన అవార్డు గ్రహీత అలువల విష్ణు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది . అక్టోబర్ 13 న రోడ్డు ప్రమాదానికి గురైన ఆలువల విష్ణు దంపతులకు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే గత వారం రోజులుగా హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న ఆయన సతీమణి అలువల రమ్యకృష్ణ మృత్యువుతో పోరాడి నేడు మరణించారు . అలువాల విష్ణు జాతీయ యువజన అవార్డు పొందారు . అనేక కార్యక్రమలలో పాల్గొని ప్రజల సమస్యల పై పోరాడారు . నిత్యం ప్రజా క్షేతంలో ఉండే ఆయన సతీమణి రమ్య కృష్ణ మృతితో ఇంటింటా విషాద ఛాయలు అలుముకున్నాయి.