*జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్ కి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 50 వేల రూపాయల ఆర్థిక సహాయం*
*భౌతిక దాడులకు తీన్మార్ మల్లన్న & టీం వ్యతిరేకం*
*నిట్ట సుదర్శన్ నా కోసం పనిచేశాడు*
*ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడ్డాడు*
*కుట్రలు కుతంత్రాలు చేసి భౌతిక దాడులు చేసి అంతమొందించే ప్రయత్నం చేశారు*
*నిట్ట సుదర్శన్ కి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భరోసాగా,బాసటగా ఉన్నాడు*
*ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు పట్టణంలో BRS గుండాల చేతిలో అత్యంత పాశవిక దాడి జరిగిన విషయం తెలిసిందే.ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలని,దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని ఆదేశించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అదే విధంగా నిట్ట సుదర్శన్ ని QNews ఆఫీస్ లో కలుసుకొని తన బాగోగులు అడిగి ధైర్యాన్నిచ్చాడు మల్లన్న…సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నా వంతు సహాయంగా 50 వేల రూపాయల చెక్కును అందజేస్తున్నాను, భవిషత్తులో కూడా తీన్మార్ మల్లన్న సుదర్శన్ కి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.నికార్సుగా కొట్లాడే నిట్ట సుదర్శన్ లాంటి వాళ్ళకి తీన్మార్ మల్లన్న ఎప్పటికీ అండగా ఉంటాడన్న విషయం ఎవరు మర్చిపోవద్దని మల్లన్న అభయాన్నిచ్చారు*