HM9NEWS ప్రతినిధి హనుమకొండ జిల్లా : మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ డీజేఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ (హనుమకొండ, వరంగల్ ) ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోరుపాక రాజు హాజరై మాట్లాడుతూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జనవరి 10 శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించేందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో “ఛలో కరీంనగర్” పేరిట జర్నలిస్టుల రాష్ట్ర మహాసభ పోస్టర్ ను విడుదల చేయడం జరిగిందని అన్నారు. చిన్న,పెద్ద తారతమ్యం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరి సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న డీజేఎఫ్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలు, మీడియాలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున హాజరై జర్నలిస్టుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎటువంటి జీతభత్యాలు ఆశించకుండా సమాజ శ్రేయస్సును కాంక్షించి స్వచ్చందంగా సేవ చేస్తున్న జర్నలిస్టులు సమాజంలో వివక్షకు గురి అవుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీలో, వివిధ ప్రభుత్వ రాయితీలను వర్తింపజేయడంలో జాప్యం జరుగుతుందని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న మహాసభను విజయవంతం చేయవలసిందిగా జర్నలిస్టులకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోరుపాక రాజు,డీజేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలోజు రాంమూర్తి,జెపిఎఫ్ రాష్ట్ర కో -కన్వీనర్ కె నరేష్,డీజేఎఫ్ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోశాల బిక్షపతి గౌడ్ ,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంజాద్, డీజేఎఫ్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షురాలు సాగంటి మంజుల, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆదిల్, వరంగల్ డీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి గట్ల శ్రీనివాస్,డీజేఎఫ్ సభ్యులు సముద్రాల సురేష్, మేడిద ప్రకాష్, ఎం డి యూనస్ ముత్తినేని సతీష్ పాల్గొన్నారు.