రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంరక్షణ కోసం కొత్త చట్టాన్ని రూపొందించింది…
సుప్రీంకోర్టు కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే సహించేది లేదంటూ పలు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలంటూ తీర్పుని ఇవ్వటం జరిగింది…
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జర్నలిస్టులపై అసభ్యకర కామెంట్స్ చేసిన దాడులకి తెగబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది…
ముఖ్యమంత్రి చెప్పినా కూడా కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు కామెంట్స్ జరుగుతున్న క్రమంలో కొన్ని జర్నలిస్టు సంఘాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలవనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం…