తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘనంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ వీరనారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సీఎం గారితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు, పలువురు నాయకులు ఉన్నారు.