HM9NEWS ప్రతినిధి ములుగు జిల్లా: మంత్రివర్యులు అనసూయ (సీతక్క) జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు- పైడాకుల అశోక్,ములుగు మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా సూచన మేరకు, కాసిందేవిపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్నిండ్ల ప్రదీప్ ఆధ్వర్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఎన్నిండ్ల ప్రదీప్ కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సీనియర్ నాయకులు ఎండి సిరాజ్ , ఎడ్ల దేవందర్ , మేడుదల కొమురయ్య, గుండాల సాంబయ్య, సీనియర్ నాయకులు,ఎండి అబ్బాస్ సోషల్ మీడియా టీం సభ్యులు, యూత్ నాయకులు కట్ల దేవేందర్, గుంజే పూర్ణయ్య , జన్నే ప్రసాద్, మూషిక కాశి,రాజు తదితరులు పాల్గొన్నారు.