Hm9news ప్రతినిధి హనుమకొండ జిల్లా: హాసన్ పర్తి మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు సందర్బంగా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 20 లక్షల రూపాయల నిధులు నూతన పంచాయతీ భవనానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే .అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ గ్రామ రైతులకు 436 మందికి 3కోట్ల 23 లక్షల రుణమాఫీ చేసామన్నారు. ఇంకా కొన్ని టెక్నికల్ సమస్యలతో రుణమాఫీ కానీ వారికి కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉంది అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు. గ్రామంలో MGNREGS నిధులతో సిసి రోడ్లకు నిధులు కేటాయించామన్నారు. గ్రామ ప్రజలు పలు సమస్యల మీద ఎమ్మెల్యే వినతిపత్రం అందజేయడంతో వాటిని పరిశీలించి త్వరితగరితన పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.