గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) చైర్మన్ ఎం కే సిన్హా గారు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్ అతుల్ జైన్ గారితో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. నీటి పారుదల శాఖ కార్యాలయం జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు తదితరులు పాల్గొన్నారు.