Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండలం గవిచెర్ల గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా జరిగే గుండ బ్రహ్మయ్య జాతరలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభ బండిని వారు ప్రారంభించి అనంతరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు,బిఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.అలాగే గ్రామంలో గుండ బ్రహ్మయ్య గుడి నిర్మాణానికి కృషిచేసిన,సహకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సహకారంతో రూ.42లక్షలు గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.బోగస్ 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో ప్రజలు చేసిందేమీలేదన్నారు.బిఆర్ఎస్ కార్యకర్తలంతా సంయమనం పాటించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ దోనికెల రమా శ్రీనివాస్, మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు,గ్రామస్తులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.