
Hm9న్యూస్ ప్రతినిధి హన్మకొండ జిల్లా: ఐనవోలు మండల కేంద్రంలో వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ ఆదేశాల మేరకు మంగళవారం క్రిస్టమస్ కానుకగా సుమారు 250 చర్చిల పరిధిలోని క్రైస్తవ సోదర, సోదరీమణులకు బహుకరించిన బ్లాంకెట్ లకు బాధ్యులుగా నియమించి యువజన కాంగ్రెస్ నాయకుల ద్వారా పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు రుగ్వేద రెడ్డి మరియు అయినవోలు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్ ఆధ్వర్యంలో అయినవోలు మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న క్రైస్తవ చర్చిలలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ సింగరాపురం జిల్లా కాంగ్రెస్ నాయకులు రాకేష్ రెడ్డి అయినవోలు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎడ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.