Search
Close this search box.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

ప్రజలకు తమదైన సాయం చేస్తానంటూ ముందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు మరియు యువజన నాయకుడు – కత్తి సుధీర్

  

HM9 న్యూస్ ప్రతినిధి హనుమకొండ జిల్లా:  ఐనవోలు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐనవోలు మండల కేంద్రం లోని రోమన్ క్యాథలిక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని   కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే .ఆర్ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడం తోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, తనను మెజారిటీతో గెలిపించడంలో అయినవోలు మండల ప్రజల పాత్ర కూడా ఉందని, ఈ రోజు అధికారికంగా ఒక ఎమ్మెల్యే హోదాలో క్రైస్తవ సోదర సోదరీమణుల మధ్య వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ క్రీస్తును కృప కటాక్షాలు ఎల్లవేళలా వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాస్టర్ల కుటుంబాలకు తన సొంత నిధులతో సుమారు 700 మందికి బట్టల పంపిణీ చేశానన్నారు. శాంతి, సహనం, కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాలాన్ని  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు ఇల్లందుల ఎలీషా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బరిగేల భాస్కర్, కొండేటి దిలీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేపల్లి బుచ్చిరెడ్డి, జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, రాయపురం సాంబయ్య,బొల్లెపల్లి మధు మరియు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు చర్చ్ ఫాదర్, దైవజనులు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
IMG_20250102_192042
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భేటీ
పునుగు పిల్లులను పట్టుకున్న హనుమకొండ ఫారెస్ట్ అధికారులు 
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలి
IMG_20241230_183120
జర్నలిస్టుల రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి