HM9 న్యూస్ ప్రతినిధి హనుమకొండ జిల్లా: హనుమకొండ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్జీ మాయావతి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కేంద్ర మంత్రి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని నిరసన ర్యాలీ చేసి రాష్ట్రపతికి కలెక్టర్ ద్వారా మెమోరాండం పంపించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు హాజరై మాట్లాడుతూకేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పైన చేసిన అవమానకర,అనుచిత వాక్యాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఒకరోజు శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు దైవ సమానుడైన అంబేద్కర్ గారిని తక్కువ చేస్తూ, అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పి తన మాటలను వెనుకకు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసారు అలాగే కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం పంపిస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి అంబేడ్కర్ గారిని అవమాన పరిచిన కేంద్రమంత్రి అమిత్ షా కు ఏమాత్రం కూడా కుర్చి లో కూర్చునే హక్కు లేదు కావునా కేంద్రమంత్రి పదవి నుండి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని శనిగరపు రాజు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ బొల్లంపల్లి సారయ్య హనుమకొండ జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ అంబేడ్కర్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బస్కే నాగరాజు పరకాల నియోజకవర్గ అధ్యక్షులు కాకి శరత్ చంద్ర వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు చింత సామ్యూల్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ము అనిల్ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షులు బుర్రి సాగర్ పసుల బిక్షపతి వస్కుల ప్రవీణ్ శ్రీకాంత్ శ్యాం కోకిల కిరణ్ రజిని కుమార్ బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు