Search
Close this search box.

కుల గణన సర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి….

*Bhatti Vikramarka | కులసర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి..!!*

రేషన్‌ కార్డు, ఇల్లు ప్రామాణికం కాదు….

Bhatti Vikramarka | హైదరాబాద్‌, నవంబర్‌ : సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రజాభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బుధవారం నుంచి ఇండ్ల జాబితాను తయారు చేస్తారని, ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేర్లతో కూడిన స్టిక్కర్లను అందజేస్తారని తెలిపారు. 9వ తేదీ నుంచి సర్వే మొదలవుతుందని చెప్పారు.

ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌బుక్‌లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కుటుంబ నిర్ధారణకు రేషన్‌కార్డుగానీ, ఇల్లుగానీ ప్రామాణికం కాదని చెప్పారు. ఒకే ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు ఉండొచ్చని, గతంలో ఒకే రేషన్‌ కార్డులో పేర్లు నమోదైనా ఇప్పుడు వేర్వేరు కుటుంబాలుగా కూడా ఉండొచ్చని తెలిపారు. అలాంటివారు విడివిడిగానే నమోదు చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

టాప్పర్మెంట్ ప్రైమ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
అక్రమ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు – కేసులు నమోదు 
Oplus_131072
ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి 
Oplus_131072
సుందరీమణులకు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికిన వరంగల్ కుడా ఛైర్మన్
ఐనవోలు మండల కేంద్రంలో హనుమాన్ శోభా యాత్ర