Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శాంతి మండల సమాఖ్య ఆఫీసులో కాకతీయ మెగా టెక్స్టైల్ కంపెనీలో భూములు కోల్పోయిన కుటుంబ సభ్యులకు రెండవ బ్యాచ్ కుట్టి శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. హెచ్ ఆర్ మేనేజర్ సుచిత్ర మాట్లాడుతూ యంగ్ వన్ కంపెనీకి రానున్న రెండు మూడు నెలల్లో పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ ఉంటుందని తెలిపారు, కావున కుట్టు శిక్షణకు వచ్చిన అభ్యర్థులందరూ కూడా చక్కగా కుట్టు శిక్షణను నేర్చుకోవాలని తెలియజేశారు. అదే విధంగా కంపెనీలో కల్పించే వసతుల గురించి కూడా వివరించడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులందరూ ఎవరు కూడా అధైర్యపడవద్దని, నైపుణ్యమున్న అందర్నీ కూడా రానున్న రోజుల్లో కంపెనీ నియమించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి మండల సమైక్య అధ్యక్షురాలు కర్నే కళ్యాణి ఏపీఎం దుంపేటి.కిషన్,టైనర్ హేమలత,రాధిక, సీసీలు బొజ్జ సురేష్ కుమారస్వామి రాజయ్య కృష్ణమూర్తి మండ. కృష్ణ సుజాత పాల్గొన్నారు