కామారెడ్డి స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని అడ్లూర్ రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ బస్సు బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు పిల్లలను కిందికి దింపి మంటలను అదుపు చేశారు. ఘటన సమయంలో సుమారు 30 మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కామారెడ్డిలో ప్రైవేట్ పాఠశాలలలు ఫిట్ నెస్ లేని బస్సులను వినియోగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.