కామారెడ్డి జిల్లా లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు నిరూపొయంగా ఉన్నాయి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ డంపింగ్ యార్డ్ లు మందు బాబులకు, పేకాట స్థావరలకు ఉపయోగ పడుతున్నాయి. ఉదాహరణ.. పాత మండలం మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామం లో చెరువు లో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు కట్టడం జరిగింది. ఇప్పుడు అవి నీటిలో మునిగి తెలుతున్నాయి. ఇవే కాదు చాలా చోట్ల ఇవే పరిస్థితి లు ఉన్నాయి. డంపింగ్ యార్డ్ లు ఉన్న కానీ చెత్త ని వేరే దగ్గర పారవేస్తున్నారు. ఇలా చేయడం వాళ్ళ ప్రజా ధనము చాలా వృధా అయిన్ది. చెత్త ని డంపింగ్ యార్డ్ లో వేయకుండా బయట వేయడం వాళ్ళ దురువాసన, ముందే ఇది వర్ష కాలం. జిల్లా లో ఈ ప్పటికి విష జ్వరాలు రావడం తో హాస్పిటల్ లో జనాలు చాలా అవస్థలుపడుతున్నారు. ఈపాటికి అయినా జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి అన్ని జిల్లా ప్రజలు కోరుతున్నారు.