కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రవేట్ కళాశాల లో సరి అయినా సదుపాయలు లేవు. కళాశాల లో బోధించే సిబ్బంది సరిగా లేకపోవడం, కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుడి భారీగా పీజులు వాసులు చేయడం జరుగుతుంది. ప్రెవేట్ కళాశాల లో హాస్టల్ అనుమతి తీసుకోకుండా ఇష్టనూసారంగా హాస్టల్ నడిపిచడం జరుగుతుంది. కొన్ని కళాశాల లో అనుమతి లేకుండా ఒకేషన్ ల్ కాలేజ్ లు కూడ నడిపిస్తున్నారు. గత సంవత్సరం నిజం సాగర్ మండలంలో గవర్నమెంట్ కాలేజీ మంజూరు కావడం జరిగింది. కానీ కాలేజ్ భవన నిర్మాణం లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా సరైన సదుపాయాలు లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతుంది. జుక్కల్ నియోజకవర్గం లో ఉన్న అన్ని మండలాలకు ఇద్దరూ పూర్తిస్థాయి MEO లు ఉండటం, మిగతా వారంతా ఇన్చార్లు కావడం విశేషం. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా కూడా సరైన ఏర్పాట్లు కానీ, సమస్యలు పరిష్కరించడం లేదు, చరవాణిలో సంప్రదించమంటే జిల్లా విద్య అధికారి అందుబాటులో ఉండడం లేదు. ఇకనైనా జిల్లా అధికారులు, కళాశాలల మీద, పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి సాధించి విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, అనుమతి లేని, ప్రైవేట్ కళాశాలలు, హాస్టల్ లను మూసివేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.