Search
Close this search box.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో మంజీరా ఇసుక క్వారీలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

మంజీరనది ఇసుక క్వారీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి:-

ఇసుక మాఫియాలో మొదలైన భయం ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇసుక మాఫియాకు ఇటీవల కొన్ని రోజులుగా అడ్డుకట్ట పడినట్లయ్యింది. ఎప్పటికి తాము చెప్పించే వింటూ ఉన్నతాదికారుల నుండి ప్రమాదం పొంచి ఉంటే సమాచారం ఇచ్చే రెవిన్యూ, పోలీస్ అధికారులు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రాక్టర్లను, టిప్పర్లను పట్టుకోవడం చూసి చూడనట్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా బాన్సువాడకు నూతనంగా విచ్చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి మహిమేనని అందరికీ అర్థమైపోయింది. దీంతో ఆమె పేరు వింటేనే ఇసుక మాఫియా వెన్నులో వణుకు పుడుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే బిచ్కుంద మండలం హసుగుల్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను సబ్ కలెక్టర్ తనిఖీ చేసి, పట్టుకొని పోలీసులకు అప్పగించి బిచ్కుంద తహసీల్దార్ సురేష్ కు అక్షింతలు వేసినట్లు తెలిసింది. ఆ విషయాన్ని మరువకముందే ఆదివారం తెల్లవారుజామున మంజీరా నది నుంచి జాతీయ రహదారి వెంబడి అక్రమంగా తరలి వెళ్తున్న ఆరు ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న మొన్నటి వరకు ఇసుక మాఫియాకు అండగా ఉన్న పోలీస్, రెవెన్యూ అధికారులకు సపోర్ట్ చేయవద్దని, జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ , బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఇసుక దొంగల భరతం పట్టడానికి సిద్ధమయ్యారని, దీనికోసం ప్రత్యేక పోలీస్ అధికారులతో రాత్రి సమయంలో మంజీరా పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా అడ్డుకట్టడానికి కదం తొక్కారని వినికిడి బిచ్కుంద మండలంలోని శెట్లూర్ గ్రామానికి చెందిన సునీల్ పటేల్, బాబు, బిచ్కుంద కు చెందిన యోగేష్, ఖాతాగావ్ కు చెందిన సలీం, మద్నూర్ మండలం కుర్ల గ్రామానికి చెందిన హనుమంతు పటేల్, అనేవారు ఇసుక మాఫియాకు బాస్ లుగా ఉంటూ సంబంధిత శాఖ అధికారులకు నెల నెల మామూలు అందిస్తూ అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.మద్నూర్ మండలం సిర్పూర్, బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామ శివారులలో పెద్ద ఎత్తున ఇసుక సంపులు వేసి జెసిపిల ద్వారా టిప్పర్లు నింపి మహారాష్ట్ర కర్ణాటక, హైదరాబాద్ కు ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయలు దండు కొంటున్నారని, వీరు చేస్తున్న ఇసుక అక్రమ వ్యాపారంపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. ఆమె కొంతమంది పోలీస్ అధికారులను ఇసుక మాఫియాను పట్టుకోవడానికి ఆదేశాలు జారీ చేశారు.

బాన్సువాడ బీర్కూరు మంజీర నది ఇసుక క్వారీలను బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. రాత్రి సమయంలో కొంతమంది ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట తహశీల్దార్ లత, డీఎస్పీ సత్యనారాయణ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు