కామారెడ్డి జిల్లా న్యాయవాద పరిషత్ ఎన్నికలు. కామారెడ్డి ప్రధాన కార్యాలయం నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన యువ న్యాయవాది సంతోష్ శర్మను జిల్లా న్యాయవాద కార్యదర్శిగా రాష్ట్ర న్యాయవాద ఆదేశాలనుసారం రాష్ట్ర కోశాధికారి మంగు లాలు సమీక్ష సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాధి బి, దామోదర్ రెడ్డి, కోశాధికారిగా గంగరాజు, సెక్రెటరీగా భార్గవ్ చంద్ర, వైస్ ప్రెసిడెంట్ లు గా సందీప్ రెడ్డి, మనోజ్ రాథోడ్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం, ప్రజలకు చట్టాల పైన అవగాహన కోసం తమ వంతు కృషి చేస్తామని జిల్లా న్యాయవాద నూతన పరిషత్ కమిటీ తెలియజేయడం జరిగింది.