ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం గాంధీ గంజిలో గల విగ్రహం దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించి, అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగినది. అనంతరం మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడినారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని కోరినారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ, పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు, గురుకుల శ్రీనివాస్ గోనె శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్వర్ అంజద్ సలీం, ప్రసాద్ ,పాత శివ కృష్ణమూర్తి మాజీ కౌన్సిలర్లు జూలూరు సుధాకర్, బట్టు మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధిక్ భూమని బాలరాజ్, చంద్ర రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, లక్క పతినిగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.