సోమవారం – తేది 23-9-2024
ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత, తదితర సమస్యలపై పలు అర్జీలను తీసుకొని ఆయా సంబంధిత అధికారులకు పంపించారు. వచ్చిన అర్జీలను ఆన్ లైన్ లో పొందుపరచడం, వాటి పరిష్కారం, అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు (120) అర్జీలు రావడం జరిగిందని చెప్పారు. ఈ ప్రజావాణి లో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ అధికారులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
..జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డిచే జారీ చేయబడినది.