కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మంగళవారం విశ్వకర్మ జయంతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపారు. శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియా, ఇన్చార్జ్ బీసీ అభివృద్ధి అధికారి చందర్, వసతి గృహాల సంక్షేమ అధికారులు చక్రధర్, నరేష్, సునీత, పవన్ పాల్గొన్నారు.