శుక్రవారం – తేది 27-9-2024
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్ స్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
….జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది.