గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ, పారిశుధ్యం, ఇంటి పన్నుల వసూళ్లు, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వాయిదాల చెల్లింపులు, లే ఔట్స్, భవన నిర్మాణాల అనుమతులు, ఉపాది హామీ, ప్రజా పాలన, వన మహోత్సవం, మహిళా శక్తి, మరుగుదొడ్లు, ఇంకుడి గుంతల నిర్వహణ, ఫాం పాండ్స్, అమ్మ ఆదర్శ పాఠశాల తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాభ్యు దయానీకి ప్రణాలికలు సిద్ధం చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలను నిర్ణీత సమయంలో ప్రచురించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాలలో పారిశుధ్యం పనులు నిరంతరం చేపట్టాలని, ఇంకుడు గుంతలు, ఫాం పాండ్స్ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. స్వచ్చత హే సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేసి విజయవంతం చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద జాబ్ కార్డులు కలిగిన వారికి వంద రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు క్రింద వ్యవసాయ అనుబంధ పనులు చేసుకోవచ్చని తెలిపారు. డ్రై డే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని అన్నారు. గ్రామాలలో ఆస్తి పన్ను, సి.సి.చార్జీలు వసూలు లక్ష్యము కనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. మహిళా శక్తి పథకం ను ఏం. పి. డి. ఓ. లు మానిటరింగ్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సి.ఈ. ఓ. చందర్, జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మండల అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
..జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది.