Hm9న్యూస్ ప్రతినిథి వరంగల్ జిల్లా: గీసుగొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, 863 ఆర్ఎన్ఆర్ లేఔట్ ప్లాట్ల లేఅవుట్ ను, 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు, 10 కోట్ల రూపాయల వ్యయంతో ఎమ్మెస్సీమీ పార్క్ (మైక్రో మినీ స్మాల్ ఇండస్ట్రీస్) లో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులకు,పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో సంగెం మండలం లోహిత నుండి గోపనపల్లి గ్రామం వరకు 4 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును మంత్రి సందర్శించి,అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసిత లబ్ధిదారులకు పట్టాలు అందించి, పారదర్శకంగా డ్రా పద్దతిలో లే అవుట్ ప్లాట్ల కేటాయింపు నిర్వహణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ నాగేశ్వరరా వుశ్వరరావు,నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.