Hm9 న్యూస్ ప్రతినిధి హనుమకొండ జిల్లా: పరకాల పట్టణ కేంద్రంలోని మయూరి గార్డెన్లో ఆదివారం రాజీవ్ గాంధీ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 ను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.కరాటే పోటీలకు నిర్వహిస్తున్న నిర్వాహకులను, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు.విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామం ఆత్మ రక్షణ క్రీడల్లో ప్రవేశం ఎంతైనా అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు.యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు,మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు.