ఓ వ్యక్తి ఎటువంటి నేరము చేసి ఉండకపోవచ్చు.ఆ వ్యక్తిపై నేరారోపణ చేయదగిన హేతుబద్దమైన కారణము ఉండకపోవచ్చ.అయినా ఆవ్యక్తిని ఇక్కట్ల పాలు చేసి,హాని చేయాలనే తలంపుతో, నేరం చేశాడంటూ తప్పడు అభియోగాలతో క్రిమినల్ చర్యలు చేపట్టినా,క్రిమినల్ చర్యలు ప్రారంభమయ్యేలా చేసినా లేదా తప్పుడు అభియోగాలతో నేరారోపణ చేసినా అలాంటి ఆరోపణలు చేసిన వారికి అయిదు సంవత్సరాల వరకు పొడిగిస్తు జైలు శిక్ష గానీ,జరిమాన విధిస్తు దానిని రెండు లక్షల వరకు పొడిగించి లేదా రెండు విధించవచ్చు.అంతేకాక, అబద్దపు ఆరోపణలతో చేపట్టిన క్రిమినల్ చర్యలు,…మరణశిక్ష, లేదా ఏడు సంవత్సరముల కన్న ఎక్కువ శిక్ష కానీ విధించదగిన నేరానికి సంబంధించినవైన పక్షంలో , అటువంటి అబద్దపు చర్యలకు పది సంవత్సరముల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదనంగా జరిమాన కుడా విధించెందుకు అవకాశం ఉంది.