HM9. న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ జిల్లా: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మంత్రుల నివాసం నందు ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు-2025 పురస్కరించుకొని (ఈ నెల 11 నుండి 18 వరకు) జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి గౌరవ అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖల మంత్రివర్యులు కొండా సురేఖ వేదమంత్రాలు నడుమ శాలువా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు మరియు టేస్క్యాబ్ చైర్మన్ శ్రీ మర్నేని రవీందర్ రావు..ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మానీ శేఖర్ రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ చోటు, జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, కర్ర హరీష్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు పత్రి భాను ప్రసాద్, కత్తి సుధీర్ గౌడ్, ఉత్సవ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ ఈవో నాగేశ్వరరావు, పండితులు తదితరులు పాల్గొన్నారు.