ఏపీలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిత్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలి. అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు. అందరూ,వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి. వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలి. ఇందులో మరో ఆలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు.