ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఇందులోభాగంగా స్వచ్చతా హీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలసి ఆయన చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికలతో ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు వారి సమస్యలను తెలుసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నేషనల్ కాలేజీ ఆవరణలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ త్యాగనిరతిని ఆయన ఈ సందర్బంగా కొనియాడారు.