Search
Close this search box.

ఏపీలో నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ సుచనలు…

ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు యంత్రాంగం సిద్ధపడాలి

 ఆయా జిల్లా ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్

మద్యం దుకాణాల్లో తగినంత మేర నిల్వలు, సమయపాలన విధిగా పాటించాలి

ఏపీలో నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఆ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని సిద్దం చేయాలని శుక్రవారం కమీషనరేట్ నుండి నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు ప్రస్తుతమున్న మద్యం డిపోలు రిటైల్ అవుట్‌లెట్ల పనితీరును ఈ సందర్భంగా మదింపు చేశారు. ప్రధానంగా డిపోలు, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌ల లో నిల్వలను ఎప్పటి కప్పుడు అంచనా వేయాలని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా షాపులను నిర్దేశించిన సమయానికంటే ముందుగా మూసివేయటాన్ని అంగీకరించ బోమని,తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ప్రతిషాపులోనూ తగినంత మేర నిల్వలు నిర్వహించాలని అధికారులను తెలిపారు.

పాలసీ మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లు ప్రైవేట్ నిర్వహణకు మారుతున్న పరిస్దితులలో రిటైల్ అవుట్‌లెట్‌ల వద్ద ఆస్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, పిఓఎస్ మెషీన్‌లు, నగదు భద్రతా బీరువాలు, రిఫ్రిజిరేటర్లు,ఇతరపరికరాలకు సంబంధించి జాబితాలు సిద్దం చేయాలని అయా ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆపీసర్లు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమస్యలను అధిగమించి అక్కడి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలన్నారు అదేవిధంగా సమస్యాత్మకంగా గుర్తించబడిన ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షకు ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్‌లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి