60. వేయిల రూపాయలు మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి
Hm9న్యూస్ ప్రతినిథి మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండల కేంద్రంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి నేను ఎఎస్ఐగా పనిచేస్తున్నాను అని నాకు ఎమర్జెన్సీగా 60. వేయిల రూపాయలు కావాలని ఫోన్ పే చేయమని నేను తమరికి క్యాష్ ఇస్తాను అని నమ్మబలికి ఫోన్ లోనే ఫోన్ పే చేయించుకొని తీరా సమయానికి ఫోన్ స్విచాఫ్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది ఈ మోసానికి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో సదరు ఉపాధ్యాయుడు గూడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాకు ఏఎస్ఐ అని చెప్పి నా వద్ద డబ్బులు ఫోన్ పే చేయించుకోవడం జరిగిందని ఎవరు అని ఏఎస్ఐ ని అడిగేసరికి ఇక్కడ ఏఎస్ఐ అలాంటి నంబర్ గల వ్యక్తులు ఎవరు లేరని చెప్పడంతో మోసపోయినట్లు నిర్ధారణ అయింది ఆ సదరు ఉపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.