*జనగామ*
*తేదీ: 29.08.2024*
*గవర్నర్ గారికి ఘన స్వాగతం పలికిన ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..*
*జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే….*
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు జనగామ జిల్లాకు విచ్చేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికార యంత్రాంగంతో ఏర్పాటు సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా భౌగోళిక పరిస్థితులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జిల్లాకు చెందిన కవులు కళాకారులు, రచయితలు ప్రముఖులతో గవర్నర్ గారు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన కూచిపూడి, భరత నాట్యం, పెరిణి శివ తాండవం వంటి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.