HM9 న్యూస్ ప్రతినిధి కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది.ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు ఐదు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి సైతం కదిలిపోవడంతో ఏ జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే నిర్మల్ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.