ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి వర్దంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ మహానాయకుడికి నివాళులు అర్పించారు. స్థానిక సంస్థల నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక పదవులు నిర్వహించడమే కాకుండా విజయ భాస్కర రెడ్డి గారు స్వచ్ఛమైన పరిపాలన అందించారని గుర్తుచేసుకున్నారు.